చంద్ర‌బాబు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు.. దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఏంటంటే??

August 6, 2020 at 8:54 am

అదేంటి..? చ‌ంద్ర‌బా‌బు కోలుకోవ‌డం ఏంటీ..? ఆయ‌న బాగానే ఉన్నారుగా అనేగా మీ సందేహం. ప్ర‌స్తుతం ట్విట్టర్‌లో చంద్ర‌బాబు పేరు హాట్ టాపిక్‌గా మారింది. #GetWellSoonCBN హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్‌గా మార్మోగింది. బాబు త్వరగా కోలుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేత‌లు ఈ హ్యాష్ ట్యాగ్‌తో మోత‌మెగిస్తున్నారు. ఇంత‌కీ ఈ హ్యాష్ ట్యాగ్ వెన‌క మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ కు చంద్రబాబు రెండు రోజులు టైం ఇచ్చిన సంగతి తెలిసిందే.

జ‌గ‌న్‌కు దమ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేస్తే ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని.. ప్ర‌జాక్షేత్రంలోనే ఎవ‌రేంటో తేల్చుకుందామ‌ని స‌వాల్ కూడా విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ అమరావతికి మద్దతు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆయన ఆరోపించారు. అలాగే ఎన్నికల ముందు రాజధాని మార్పు గురించి వైసీపీ నేతలు ఎక్కడా చెప్పలేదని… పైగా దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

అయితే చంద్ర‌బాబుకు కౌంట‌ర్‌గా వైఎస్సార్‌సీపీ ఈ `గెట్ వెల్ సూన్ చంద్రబాబు` హ్యాష్ ట్యాగ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేత‌లు త‌దిత‌రులు.. త్వరగా బాబు కోలుకోవాలంటూ ట్వీట్స్ పెడుతూ టార్గెట్ చేశారు. దీంతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

చంద్ర‌బాబు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు.. దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఏంటంటే??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts