కష్టకాలం తీరే అంత వరకు సినీ కార్మికులకు సహాయం ఆగదు : చిరంజీవి

August 21, 2020 at 3:37 pm

కరోనా ప్రభావంతో తెలుగు సినీ కార్మికులంతా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమేనని చెబుతూ సినీకార్మికుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ద్వారా మూడో విడత నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్​లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని 10 వేల మంది సినీ కార్మికులకు మూడో విడత సరకులు అందజేసినట్లు చిరు వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్​లో సమావేశమైన సీసీసీ కమిటీ… మూడో విడతలో ఇప్పటికే 6 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపింది. చిత్రపరిశ్రమ పూర్తిగా కొలుకునేంతవరకు సరకులు అందజేసేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్​లుక్, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఈ సర్​ప్రైజ్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో ఎర్ర కండువాతో కనిపిస్తున్నాడు చిరు.

కష్టకాలం తీరే అంత వరకు సినీ కార్మికులకు సహాయం ఆగదు : చిరంజీవి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts