బాబాయి వెంకీ, తండ్రి సురేష్ బాబుతో రానా సంద‌డి.. వైర‌ల్ అవుతున్న ఫొటో!!

August 8, 2020 at 10:58 am

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి మ‌రికొన్ని గంట‌ల్లో ప్రియురాలు మిహీకా బజాజ్ మెడ‌లో మూడుముళ్లు వేసి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో.. వేదమంత్రాల నడుమ అత్యంత సన్నిహితుల మధ్య రానా, మిహీకా పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఇక పెళ్లి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత చేయాలని భావించినా.. ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవటంతో అతి కొద్ది మంది అతిథుల మధ్య క‌రోనా‌ నింబంధలను పాటిస్తూ ఈ వేడుక‌ చేయాలని నిర్ణయించారు.

<p>రానా, మిహీకాల పెళ్లి సంబరాలు</p>

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వివాహానికి ముందు ఉత్సవాలు గత రెండ్రోజులుగా ప్రారంభమయ్యాయి. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కొడుకును చేయడం లాంటి కార్యక్రమాలతో ఇరు కుటుంబాలు బిజీ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. ఈ సంద‌ర్భంగా రానా షేర్ చేసిన ఓ ఫొటో నెటిజ‌న్‌ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

<p style="text-align: justify;">టాలీవుడ్ హంక్‌ రానా దగ్గుబాటి మరో రెండు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చాలా ఏళ్లు పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుంటూ వస్తున్న ఈ కండల వీరుడు, లాక్‌ డౌన్‌ సమయంలో తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ప్రముఖ బిజినెస్‌ ఉమెన్‌ మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించాడు రానా. ఈ జంట తమ ప్రేమను వెల్లడించిన వెంటనే ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాయి.</p>

వ‌రుడిగా మారిన రానా త‌న తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంక‌టేష్‌తో క‌లిసి సంద‌డి చేస్తూ దిగిన ఫొటోని షేర్ చేశాడు. పెళ్లికి రెడీ అని కామెంట్ కూడా పెట్టాడు. ఇక ఈ ఫొటోల‌ను వెంక‌టేష్‌, సురేష్ బాబు మ‌రియు రానా ఒకే ఫ్రేంలో సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించారు. దీంతో రానా స్నేహితులు, బంధువులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

బాబాయి వెంకీ, తండ్రి సురేష్ బాబుతో రానా సంద‌డి.. వైర‌ల్ అవుతున్న ఫొటో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts