బ్రేకింగ్: ఇళ్ల పట్టాల పంపిణీ మళ్ళీ వాయిదా..

August 12, 2020 at 12:34 pm

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే ఉగాది నాడు జరగాల్సిన కార్యక్రమం జూలై8కు వాయిదా పడింది. అయితే ఇళ్ల పట్టాల విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో, కార్యక్రమాన్ని ఆగష్టు 15కు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం వాయిదా పడిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలియజేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ఇళ్ళు లేని ప్రజలు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్, ఎన్నికల హామీల్లో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్ళు కట్టిస్తానని చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక ఆ దిశగా జగన్ ముందుకెళ్లారు. ఈ ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు భూమిని పేదలకు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు అన్ని పనులు చేసినా కరోనా కారణంగా అది జూలై 8కి వాయిదా పడింది.

అయితే భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, అసైన్ మెంట్ స్థలాలలో ఇల్లు కట్టకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని, వాటిపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో హక్కులు ఎలా బదలాయిస్తారని చెప్పి కోర్టుకెక్కారు. దీంతో మరోసారి ఈ కార్యక్రమం ఆగష్టు 15కు వాయిదా పడింది. ఇక ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం వాయిదా పడిందని మంత్రి ధర్మాన తెలిపారు. అంటే ఆగష్టు 15న కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండదు అనమాట.

బ్రేకింగ్: ఇళ్ల పట్టాల పంపిణీ మళ్ళీ వాయిదా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts