ఇది విన్నారా.. ఈ చీర‌లు క‌ట్టుకుంటే క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌!

August 15, 2020 at 8:05 am

చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టేసిన సంగ‌తి తెలిసిందే. అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం అడుతోంది. అయితే క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టాలంటే.. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో హ్యాండ్లూమ్ మరియు హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఇమ్యూనిటీని పెంపొందించే చీరలు అంటూ కొన్ని చీరల‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు.

ఈ చీరలను వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో రూపొందించారు. వీటిని ధరించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. ఫలితంగా కరోనా వైరస్‌ దరిచేరదని కార్పొరేషన్‌ అధికారులు అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం.. భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్‌ మాలేవర్‌కి అప్పగించింది. ఇక ఈ తరహా వస్త్రాల రూపకల్పనలో యాలకులు, జాపత్రి, లవంగాలు, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు, రాయల్ జీలకర్ర, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు.

వీటిని పొడిచేసి రెండ్రోజుల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని మరిగించగా వచ్చిన ఆవిరిని చీరలకు పట్టిస్తారు. ఈ పద్ధతిలో ఓ చీర ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు అందిపుచ్చుకోవడానికి దాదాపు ఆరు రోజుల వరకు పడుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ చీర ఖరీదు కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఒక్కో చీరను రూ.3 వేలకు విక్రయించనున్నామని కంపెనీ పేర్కొంది.

ఇది విన్నారా.. ఈ చీర‌లు క‌ట్టుకుంటే క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts