ఏపీ లో ఆగని కరోనా ఉద్ధృతి… తాజాగా 9,597 కొత్త కేసులు…!

August 12, 2020 at 6:44 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రం లోని ప్రభుత్వ అధికారులు, వైద్యులు అనేక నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కోవిడ్ -19 తగ్గుముఖం పట్టడంలేదు. ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ మీడియా పూర్వకంగా విడుదల చేసింది. తాజాగా 57,148 మందికి శాంపిల్స్ ను పరీక్షించగా అందులో ఏకంగా 9,597 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ సంఖ్యతో రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య 2,54,146 కు చేరుకుంది.

ఇక అలాగే గడచిన 24 గంటల్లో 6,676 కోవిడ్ 19 బాధితులు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ 19 నుండి కోలుకున్న వారి సంఖ్య 1,61,425 కు చేరుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 90,425 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 93 మంది ప్రాణాలు విడిచారు. దీంతో కోవిడ్ -19 బారినపడి మృతి చెందినవారి సంఖ్య 2296 మంది ప్రాణాలు వదిలారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు 26,48,767 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. ఇప్పటివరకు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 35,642 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కర్నూలు జిల్లాలో నేటి వరకు 258 మంది కోవిడ్ -19 బారినపడి మృతి చెందారు.

ఏపీ లో ఆగని కరోనా ఉద్ధృతి… తాజాగా 9,597 కొత్త కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts