త్వరలో గాడిద పాల డెయిరీ.. లీట‌ర్ ఎన్ని వేలో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!!

August 10, 2020 at 3:36 pm

పాలు, పాల‌తో త‌యారు చేసే ప‌దార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తి రోజు డైట్‌లో పాలు చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే మన దేశంలో ఎక్కువగా ఆవు, గేదె పాలను మాత్రమే తాగుతారు. అందుకే వీటికి మాత్రమే డెయిరీలు ఉంటాయి. కానీ దేశంలోనే తొలిసారిగా గాడిద పాల డెయిరీ ఏర్పాటవుతోంది. హర్యాణాలోని హిస్సార్ లో ఉన్న నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ లో ఈ డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు.

దీని కోసం 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ కూడా ఇచ్చారు. . ఇందుకోసం పది వేల హలారి జాతి గాడిదలను తెప్పించింది. ఈ గాడిదలు ప్రస్తుతం సంతానోత్పత్తిలో ఉన్నాయి. తొలుత గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని… ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది. ఇక‌ హ‌లారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గాడిద పాలు కీలక పాత్రను పోషిస్తాయి.

చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయి. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడేందుకు ఈ గాడిదల పాలు తోడ్పడతాయి. అందుకే వీటి పాల ధర లీటర్ కు రూ. 7 వేల వరకు ఉంటుంద‌ని తెలుస్తోంది.

త్వరలో గాడిద పాల డెయిరీ.. లీట‌ర్ ఎన్ని వేలో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts