ఆ మెగా హీరో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా బాధితుడేనా..!

August 5, 2020 at 8:17 am

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అనంత‌రం అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె చుట్టూ ప‌లు వివాదాలు ముసురుకుంటున్నాయి. రియా సుశాంత్ బాగా వాడుకుంద‌ని… అత‌డితో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టించింద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక పోలీసుల విచార‌ణ‌లో కూడా ఆమె గురించే ప‌లు విష‌యాలు వెల్ల‌డి అవుతున్నాయి. అటు సుశాంత్ కుటుంబ స‌భ్యులు కూడా ఆమెపైనే ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ తండ్రి కెకె సింగ్ సైతం రియాపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించింద‌ని తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఇప్పుడు రియా జాతీయ మీడియాలో సైతం హైలెట్ అవుతుండ‌డంతో ఆమె వ్య‌క్తిగ‌త‌, సినిమా జీవితానికి సంబంధించిన విష‌యాలు కూడా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ముందు మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు సినిమాతోనే వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చింది. 2012 లో తెలుగు సినిమా తూనీగ, తూనీగతో కెరీర్ ప్రారంభించిన రియా 2019లో మ‌రో తెలుగు సినిమాలో న‌టించేందుకు సైన్ చేసింది. ఈ సినిమా పేరు సూప‌ర్ మ‌చ్చి. మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఒక షెడ్యూల్ కంప్లీట్ కూడా అయ్యింది.

త‌ర్వాత ఏ కార‌ణం లేకుండానే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ట‌. దీనిపై తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు కూడా జ‌రిగాయ‌ని తెలుస్తోంది. రియా త‌ప్పుకున్నాక ఈ సినిమా ద‌ర్శ‌కుడు పులి వాసు కన్నడ నటి రచిత రామ్‌ను ఈ చిత్రంలో ప్రధాన నటిగా తీసుకున్నారు. త‌రువాత కొన్ని సన్నివేశాలను రచిత, కళ్యాణ్ దేవ్‌ల‌పై చిత్రీకరించారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని స్వరపరిచారు. అలా ఈ మెగా హీరోకు రియా షాక్ ఇచ్చింద‌న్న వార్త ఇప్పుడు బ‌య‌ట ప‌డింది.

ఆ మెగా హీరో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా బాధితుడేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts