చింత‌మ‌నేని గ‌తే.. జేసీకి కూడా.. సేమ్ టు సేమ్‌

August 8, 2020 at 12:37 pm

రాజ‌కీయాల్లో ఉన్నాం క‌దా.. అని నోరు పారేసుకుంటే.. ఏమ‌వుతుంది? ఇప్పుడు క‌నిపిస్తున్న క‌థే రిపీట్ అవుతుంది. గ‌తంలో టీడీపీ నాయ‌కుడు , ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు నేనే దిక్కు అంటూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. పార్టీ అధికారం కోల్పోయాక‌.. దాదాపు 66 రోజులు జైలు ప‌క్షిగా మారారు. ఒక కేసులో బెయిల్‌పై రావ‌డం, మ‌రో కేసులో జైలుకు వెళ్ల‌డం ఇలా రెండున్న‌ర నెల‌ల‌పాటు ఆయ‌న జైలులోనే ఉన్నారు. ఈ విష‌యంలో సాయం చేసేందుకు కూడా టీడీపీ ముందుకు రాలేక పోయింది. ఎంద‌రో మేధావులు ఉండి కూడా పార్టీ త‌ర‌ఫున ఆయ‌న‌కు సాయం చేసేందుకు ఒక్క‌రూ ముందుకు రాలేక పోయారు.

ఇక‌, ఇప్పుడు అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అచ్చు ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విధుల్లో ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పట్ల జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంపై తాజాగా ఆయ‌న అరెస్ట‌య్యారు. నిజానికి 24 గంట‌ల కింద‌టే ఆయ‌న వాహ‌నాలకు సంబంధించిన కేసులో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. జైలు నుంచి వస్తూనే 500 మందితో జేసీ ఊరేగింపు జరిపారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చారు.

వీడియో క్లిప్పింగ్స్, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేశారు. దీంతో జేసీ ప‌రిస్థితి ఏంటా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు. దూష‌ణ‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇలా అనేక కోణాల్లో ఆయ‌న కూడా వివాదాస్ప‌ద మ‌య్యారు. ఫ‌లితంగా ఒక కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే.. వెంట‌నే మ‌రో కేసులో ఇరుక్కున్నారు. ఫ‌లితంగా టీడీపీ నాయ‌కులు కూడా అచేత‌నంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు జేసీ ప‌రిస్థితి కూడా అలానే త‌యారైంది.

ఆయ‌న ఒక కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. మ‌రో కేసులో అరెస్ట‌యి.. జైలుకు వెళ్లారు. అయితే, చిత్రం ఏంటంటే.. టీడీపీ ఎంత గా వీరిని కాపాడాల‌ని అనుకున్నా.. కాపాడే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో నాయ‌కులు అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివారు ఎంత‌మంది తెర‌మీదికి వ‌స్తారో చూడాలి.

చింత‌మ‌నేని గ‌తే.. జేసీకి కూడా.. సేమ్ టు సేమ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts