క‌రోనాకు చెక్ పెట్టే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇప్ప‌ట్లో రాన‌ట్టేనా..??

August 1, 2020 at 10:16 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా వైర‌స్‌.. అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను క‌మ్మేసి ప్ర‌జ‌ల‌ను నానా తిప్ప‌లు పెడుతోంది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇంకెంత‌మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌లైపోతారో అర్థంకావ‌డం లేదు.

అయితే వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని తేల‌డంతో.. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈనేప‌థ్యంలోనే ప్రపంచ‌దేశాల్లోనూ క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనే దిశ‌గా శాస్త్ర‌వేత్త‌లు అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు. బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, స్వీడన్ సంస్థ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్, తొలి రెండుదశలనూ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రపంచ మానవాళికి ఆశాదీపంలా కనిపించింది.

ఏప్రిల్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, రెండు దశల ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. ఇప్పుడు మూడవ దశ ట్రయల్స్ సాగుతుండగా.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కోతుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా.. ఊపిరితిత్తులను రక్షించడం, వైరస్ నియంత్రించడంలో ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ సత్ఫలితాలను ఇస్తుంది. అయితే కరోనా బారిన పడకుండా ముందే నివారించేందుకు మాత్రం ఈ వైరస్ పనిచేయడం లేద‌ని పరిశోధకులు తెలిపారు. అందుకే ఈ అధ్యాయానాన్ని మరికొన్ని రోజులు కొనసాగించాలని వారు అంటున్నారు. దీనిని బ‌ట్టీ చూస్తుంటే.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇప్ప‌ట్లో రాద‌నే భావ‌న కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

క‌రోనాకు చెక్ పెట్టే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇప్ప‌ట్లో రాన‌ట్టేనా..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts