గద్దె ఛాలెంజ్ అవినాష్‌కు కలిసి రానుందా?

August 4, 2020 at 2:37 pm

అమరావతికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమవుతున్నారని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉపఎన్నికల్లో ఎంతమంది తిరిగి గెలవగలరు? అనే ప్రశ్న తలెత్తితే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలు కొందరు వైసీపీ నేతలకు కలిసొచ్చే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటం, ఇంకా జగన్ వేవ్ ఉండటం వల్ల కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపు బాటపట్టరని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్ గనుక రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు కలిసొచ్చేలా ఉంది. గత రెండు పర్యాయాల నుంచి తూర్పులో గద్దె తిరుగులేని విజయాలు అందుకుంటున్నారు. మొన్న ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా సరే గద్దె…మంచి మెజారిటీతోనే గెలిచారు.

అయితే జగన్ ఎన్నికల్లో గద్దె మీద ఓడిపోయిన బొప్పన భవకుమార్‌ని తప్పించి, తూర్పు ఇన్‌చార్జ్ బాధ్యతలని దేవినేని అవినాష్‌కు అప్పగించారు. ఇక తూర్పు బరిలోకి అవినాష్ వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు మారిపోయాయి. రోజురోజుకూ ఇక్కడ టీడీపీ వీక్ అవుతుంటే…వైసీపీ బలపడుతుంది. ఇలా వైసీపీ బలపడటానికి ఏకైక కారణం దేవినేని అవినాష్. ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అవినాష్…నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు.

ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే అవినాష్ ప్రజల సమస్యలని పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ పథకాలని ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు సి‌ఎం రిలీఫ్ ఫండ్ కూడా అందేలా చేస్తున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ, ప్రజలకు అండగా ఉంటున్నారు. అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లకుండా అవినాష్ దగ్గరకే వస్తున్నారు. అంతలా అవినాష్ తూర్పులో పనులు చేస్తూ, ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇలాంటి సమయంలో గద్దె రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే దేవినేనికు బాగా ప్లస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

గద్దె ఛాలెంజ్ అవినాష్‌కు కలిసి రానుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts