ప్రతిపక్ష నేతపై విషప్రయోగం చేయించింది దేశ అధ్యక్షుడే

August 21, 2020 at 4:17 pm

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో నిరసనలు చేపట్టారు ఆయన మద్దతుదారులు, అభిమానులు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో నగరాల్లో వేలాది మంది ఆందోళనకారులు గుమిగూడారు. విష ప్రయోగం వెనుక అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందని నినాదాలు చేశారు. రష్యా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​కు చిరకాల ప్రత్యర్థిగా పేరుగాంచిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ప్రస్తుతం ఓమ్స్ నగరంలోని ఓ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు.

నావల్నీ అధికార ప్రతినిధి కైరా యర్మిష్ ఓ రేడియో స్టేషన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. గురువారం, విమానాశ్రయంలోని ఓ కేఫ్​లో నావల్నీ టీ సేవించారని.. ఆ టీలోనే విషం కలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కోమాలో ఉన్న నావల్నీకి చికిత్స అందించేందుకు, అవసరమైతే విదేశాలకు తీసుకెళ్లడానికి వెనకాడొద్దని నావల్నీ కార్యాలయం.. ఆసుపత్రిని కోరింది.ఈ నేపథ్యంలో నావల్నీపై విష ప్రయోగం చేసే అవసరం పుతిన్​కు తప్ప ఎవరికీ లేదని ఆందోళనకారులు మండిపడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రతిపక్ష నేతపై విషప్రయోగం చేయించింది దేశ అధ్యక్షుడే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts