ఏపీ విద్యార్థులకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

August 14, 2020 at 7:41 am

ప్ర‌స్తుతం క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలోనూ ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఏపీ విద్యార్థుల‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలను ప్రారంభించి ఈ విద్యాసంవత్సరాన్ని పున:ప్రారంభించాలని నిర్ణయిచింది.

అయితే అదే రోజు సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ అందజేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దీని కోసం సుమారుగా రూ. 650 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి జూనియ‌ర్ క‌ళాశాల‌లు పున‌: ప్రారంభం అవుతాయ‌ని మంత్రి సురేష్ వెల్లడించారు. క‌ళాశాల‌లు తెర‌వ‌గానే గ‌త విద్యా సంవ‌త్సరం చివ‌రి సెమిస్టర్ ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని మంత్రి సురేష్ వెల్లడించారు.

ఏపీ విద్యార్థులకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts