ఐపీఎల్​లో చోటు దక్కలేదని భారత్ క్రికెటర్ ఆత్మహత్య!

August 12, 2020 at 7:03 pm

ఐపీఎల్​.. ఎంతో మంది యువ క్రికెటర్లు తన ప్రతిభను నిరూపించుకునే వేదిక. అలాంటి మెగాటోర్నీలో ఆడే అవకాశం రాలేదని బలన్మరణానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువ ఆటగాడు కరణ్​ తివారీ. ముంబయికి చెందిన ఈ ఆటగాడు.. గోకుల్​దామ్​లోని తన ఇంట్లో సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకొని చనిపోయాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​లా బౌలింగ్​ యాక్షన్​, ఫిజిక్​ ఉండటం వల్ల అందరూ ఇతడిని ‘జూనియర్​ స్టెయిన్​’ అని పిలుస్తారట.

కరణ్​.. ఆత్మహత్య చేసుకునే ముందు ఉదయ్​పుర్​లోని తన స్నేహితుడికి కాల్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఐపీఎల్​లో ఆడే అవకాశం రాలేదని అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడట. కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఈ యువ క్రికెటర్​ చాలా రోజులుగా ఒత్తిడి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్​ వేలంలో పాల్గొనాలంటే.. ఏ ఆటగాడైనా ఏదో ఒక రాష్ట్రం తరఫున ఆడి ఉండాలి. అయితే స్నేహితులు, బంధువుల ప్రకారం కరణ్​కు మంచి బౌలింగ్​ అనుభవం ఉందని, వాంఖడేలో మ్యాచ్​లు జరిగినప్పుడు ఐపీఎల్​ ఆటగాళ్లకు బౌలింగ్​ చేసేవాడని తెలిపారు. ఇటీవలే ఇతడు సౌవెనీర్​ క్లబ్​, యునైటెడ్​ స్పోర్ట్స్​ క్లబ్​లో లెవల్​-1 కోచింగ్​ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. క్లబ్​ల తరఫున ఆడిన కరణ్​.. ఏ రాష్ట్ర జట్టు తరఫున ఆడలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఐపీఎల్​లో చోటు దక్కలేదని భారత్ క్రికెటర్ ఆత్మహత్య!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts