ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే త‌న‌యుడికి క‌రోనా!!

August 1, 2020 at 1:38 pm

క‌రోనా వైర‌స్‌.. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంతక వైర‌స్‌.. ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. సామాన్యులనే కాదు.. ప్రజా ప్రతినిధులకు, సెల‌బ్రెటీల‌కు కూడా క‌రోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే త‌న‌యుడికి క‌రోనా పాజిటివ్‌గా తెలింది.

Karanam Venkatesh JaganYSRCP | Tellugu News updates

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలిపారు. ప్రస్తుతం తాను కుటుంబ సమేతంగా హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

వైసీపీలో చేరిన కరణం వెంకటేష్ ...

మళ్లీ 15 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, ఏపీలో క‌రోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,933కి పెర‌గ‌గా.. కరోనా మృతుల సంఖ్య 1349కు చేరుకుంది.

 

ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే త‌న‌యుడికి క‌రోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts