షాకింగ్: బెజవాడలో గొడుగు ఉంటేనే మద్యం…!

August 7, 2020 at 1:32 pm

కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రతీ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రజల్లో ఆందోళన ఉంది. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం వ్యక్తమవుతుంది. తాజాగా విజయవాడలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. మద్యం కోసం వైన్ షాపుల వద్ద గోడుగులతో క్యూ కట్టారు మందు బాబులు. బెజవాడలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైన్ షాపుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

గొడుగు, మాస్క్ లేనిదే మద్యం ఇవ్వడం లేదు వైన్ షాప్ సిబ్బంది. గొడుగు తో సోషల్ డిస్టెన్స్ ఉండేలా వైన్ షాపుల వద్ద చర్యలు చేపట్టారు. కోవిడ్ నిబంధనలు ప్రకారం మాస్క్ లేని వారికి మద్యం ఇవ్వడం లేదని సిబ్బంది చెప్తున్నారు. మద్యం కోసం గొడుగులతో వైన్ షాపుల వద్ద భారీ క్యూ లైన్ లు ఉన్నాయి. విజయవాడ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఉన్నాయి.

షాకింగ్: బెజవాడలో గొడుగు ఉంటేనే మద్యం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts