మాజీ సీఎంకు మ‌హేష్‌పై ఉన్న ప్రేమ ఎన్టీఆర్‌పై లేదే…!

August 11, 2020 at 5:04 pm

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు నారా, నంద‌మూరి ఫ్యామిలీతో ఉన్న గ్యాప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుటుంబాన్ని చంద్ర‌బాబు, బాల‌య్య ద‌గ్గ‌ర‌కు తీసుకున్న‌ట్టు బ‌య‌ట ప్ర‌పంచాన్ని న‌మ్మించారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసినిని పోటీ చేయిస్తే ఆమె చిత్తుగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆ కుటుంబాన్ని చంద్ర‌బాబు, బాల‌య్య ఏ మాత్రం ప‌ట్టించుకున్న‌ట్టే లేదు. ఇక గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావే వైసీపీలోకి జంప్ చేసేశారు.

ఇక ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు, లోకేష్ ఇప్ప‌ట‌కీ కూడా దూరం పెడుతున్నారు అనేందుకు తాజా ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ‌లు. 2009 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ను పూర్తిగా సైడ్ చేసేస్తూ వ‌చ్చారు. ప‌దేళ్లుగా ఎన్టీఆర్ పార్టీకి సంబంధించిన ఒక్క స‌మావేశంలో కూడా క‌నిపించ‌లేదు. చంద్ర‌బాబు అండ్ లోకేష్ నుంచి ఎన్ని ఇబ్బందులు, అవ‌మానాలు ఎదురైనా కూడా ఎన్టీఆర్ మాత్రం త‌న తాత స్థాపించిన పార్టీలోనే ఉంటాన‌ని చెపుతూ వ‌స్తున్నారు.

తాజాగా చిరంజీవి, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్ లాంటి హీరోల పుట్టిన రోజు నాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు, ఎన్టీఆర్ బ‌ర్త్ డే రోజు మాత్రం మ‌ర్చిపోయారు. మే 20న నంద‌మూరి అభిమానులు ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ సోష‌ల్ మీడియాను హోరెత్తించినా చంద్రబాబు మాత్రం చెప్పలేదు. తాజాగా మ‌హేష్‌కు చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ ట్వీట్స్ చేసి రీ విషెస్ చెప్పారు. దీనిపై ఫైర్ అవుతోన్న జూనియ‌ర్ అభిమానులు.. ఇత‌ర హీరోల‌ను కూడా గుర్తుంచుకున్న చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ క‌న‌ప‌డ‌లేదా ? అని భ‌గ్గుమంటున్నారు.

ఇక ఎన్టీఆర్ త‌న కుమారుడు లోకేష్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఎక్క‌డ పోటీ వ‌స్తాడో ? అని కావాల‌నే అణ‌గ‌దొక్కుతున్నార‌ని.. క‌నీసం లోకేష్ కూడా ఎన్టీఆర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారంతా గుస్సాగా ఉన్నారు. మ‌రి వీరి వివాదం భ‌విష్య‌త్తులో ఎలా మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.

మాజీ సీఎంకు మ‌హేష్‌పై ఉన్న ప్రేమ ఎన్టీఆర్‌పై లేదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts