ఎన్టీఆర్ – మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌… ‘ మెగా ‘ ప్లాన్ వేసిందెవ‌రంటే….!

August 5, 2020 at 4:02 pm

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో యువ హీరోలు మ‌హేష్‌బాబు సీనియ‌ర్ హీరో వెంకీతో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమా చేశాడు. ఇక వెంకీ ప‌వ‌న్‌తో గోపాలా.. గోపాలా.. వ‌రుణ్‌తేజ్‌తో ఎఫ్ 2 సినిమాలు చేశాడు. ఇక రామ్‌తో మ‌సాలా సినిమా కూడా చేశారు. ఇలా మ‌ల్టీస్టారర్లు చేయ‌డంలో వెంకీ ముందున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిస్ట‌రీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌ల్టీస్టారర్ల‌లోనే ఆర్ ఆర్ ఆర్ ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో అదిరిపోయే మ‌ల్టీస్టార‌ర్ ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్. వాస్త‌వానికి మ‌హేష్‌బాబుతో సినిమా చేసేందుకు అల్లు అర‌వింద్ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే అది ఎప్ప‌టిక‌ప్పుడు సెట్ కావ‌డం లేదు. ఇక ఇప్పుడు అల్లు అర‌వింద్ మ‌దిలో మ‌రో ఆలోచ‌న మెదులుతోంద‌ట‌. మ‌హేష్‌తో పాటు ఎన్టీఆర్‌ను కూడా ఒప్పించి.. వీరిద్ద‌రి కాంబోలో బ‌డా మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తే అది ఇండ‌స్ట్రీలోనే ఓ రికార్డుగా నిలిచిపోతుంద‌ని అల్లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఒక వేళ ఈ ఇద్ద‌రు హీరోలో కాంబోలో మెగా ప్రొడ్యుస‌ర్ అల్లు అర‌వింద్ సినిమా సెట్ చేస్తే మెగా హీరోల‌తో పాటు ఆ ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరో బ‌న్నీ సైతం ప్ర‌మోష‌న్స్‌లోకి దిగిపోతాడు. అప్పుడు ఈ సినిమాకు అటు ఎన్టీఆర్‌, మ‌హేష్ అభిమానుల‌తో పాటు ఇటు బ‌న్నీ, మెగా అభిమానుల స‌పోర్ట్ కూడా ఈ క్రేజీ మల్టీస్టార‌ర్‌కు ఉంటుంది. అప్పుడు ఈ సినిమా రేంజ్ ఇంకెలా ఉంటుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌తో పాటు త్రివిక్ర‌మ్ సినిమా చేస్తున్నారు. మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ – మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌… ‘ మెగా ‘ ప్లాన్ వేసిందెవ‌రంటే….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts