నేటి రాత్రికే మెగా డాట‌ర్ నిహారిక నిశ్చితార్థం.. ఎక్క‌డో తెలుసా?

August 13, 2020 at 11:26 am

ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు నాగ‌బాబు కుమార్తె నిహారిక త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే తనకు కాబోయే వరుడు గురించి మెగా డాటర్ అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చిరంజీవి ముందుండి ఈ సంబంధాన్ని కలిపిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

ఎన్నాళ్ల నుంచో తెలిసిన కుటుంబాన్ని మెగాస్టార్ తన తమ్ముడి కూతురుకు కలుపుకున్నారంటూ ప్ర‌చారం జ‌రింది. ఇక పెళ్లి కుదిరిన తర్వాత చైతన్య, నిహారిక జంట సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులతో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి 8 గంటలకు జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ మెగా వేడుక హైదరాబాద్‌లోనే జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు, ఈ రోజు నిహారిక నిశ్చితార్ధం కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన‌బోతుందని స‌మాచారం. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్ర‌మే ఆహ్వానం పంపించార‌ట‌. ఇక వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుందని తెలుస్తోంది. కాగా నిహారిక‌ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటించిన విష‌యం తెలిసిందే.

నేటి రాత్రికే మెగా డాట‌ర్ నిహారిక నిశ్చితార్థం.. ఎక్క‌డో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts