చిరంజీవి హీరో – రొట్ట క‌థ – డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్… ఈ కాంబోలో సినిమానా…?

August 7, 2020 at 7:34 pm

ఈ టైటిల్ చూడ‌డానికే షాకింగ్‌గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబ‌ర్ 150 లాంటి హిట్ సినిమాతో పాటు సైరా లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో న‌టించాడు. ఇక చిరు ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరు మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. చిరుకు ద‌గ్గ‌ర బంధువు అయిన మెహ‌ర్ ప్ర‌స్తుతం మెగా కాంపౌండ్‌లోనే ఉన్నాడు. చిరు మెహ‌ర్‌కు నీకు ఓ ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

 

ఈ షాకింగ్ కాంబోలో ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ వ‌చ్చింది. షాడో లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఆరేడేళ్లుగా ర‌మేష్‌ను ఏ హీరో కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. ఇప్పుడు మెగాస్టార్ – మెహ‌ర్ కాంబోలో తెర‌కెక్కే సినిమాకు మూలం తమిళ సినిమా వేదాళం అట‌. అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అక్క‌డే యావ‌రేజ్ అయ్యింది. ఇది రొటీన్ క‌థ‌. పైగా అక్క‌డ వీర‌మ్‌ను మ‌న ప‌వ‌న్ చేస్తే కాట‌మ‌రాయుడు ఎలా అయ్యిందో ఇప్పుడు వేదాళం కూడా అదే టైప్‌లో ఉంటుంది.

 

మ‌రి చిరు ఇంత డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో ఆ అరిగిపోయిన క‌థ‌తో చిరు ఎందుకు సినిమా చేసే రిస్క్ చేస్తున్నాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. పైగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిర్మాత కేఎస్‌. రామారావు ఈ సినిమాను నిర్మిస్తార‌ని కూడా ప్రచారం జ‌రుగుతోంది. త‌మిళ్‌లో అజిత్ ప‌క్క‌న శృతీహాస‌న్ న‌టించింది. పైగా ఈ సినిమాను ఇప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కులు యూట్యూబ్‌లో చూసేశారు. మ‌రి ఈ సినిమాను చిరు నిజంగానే రీమేక్ చేస్తాడా ? లేదా నాన్చి నాన్చి ప‌క్క‌న పెడ‌తారా ? అన్న‌ది చూడాలి.

చిరంజీవి హీరో – రొట్ట క‌థ – డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్… ఈ కాంబోలో సినిమానా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts