ఎంసెట్ ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన మంత్రి సురేశ్‌..

August 14, 2020 at 5:06 pm

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11వ తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఎంసెట్, సెప్టెంబరు 28నుంచి 30వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్ 1న ఎడ్‌సెట్, లాసెట్‌, అక్టోబరు 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్‌ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము అనేక రంగాలలో అభివృద్ధి సమాచారాన్ని ముందుగా ఎప్పటికీ అప్పుడు మీడియా వేదికగా తెలియజేస్తూ వస్తుంది.. ఇప్పటికే లక్ష ఉద్యోగాలు దిశగా సచివాలయం ఉద్యోగాలకి పరీక్ష తేదీలను ప్రకటించింది. కరోనా మహమ్మారి వలన పరీక్ష రాయడానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎంసెట్ ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన మంత్రి సురేశ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)