నా ప్ర‌యాణం వైసీపీతోనే.. జనసేన ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్‌!!

August 12, 2020 at 2:39 pm

జ‌న‌సేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార తీరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వాస్త‌వానికి ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ ప్ర‌భుత్వంపై విరుచుకుపడుతుంటే.. ఈయ‌న‌ మాత్రం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కూడా సొంత పార్టీ అయిన జ‌న‌సేన‌పై హాట్ కామెంట్స్ చేశారు రాపాక‌.

జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ అని చెప్పిన ఆయన.. అది ఎప్పటివరకు ఉంటుందో తెలియదన్నారు. కేవలం పోటీలో ఉండాలి కాబట్టే జనసేనలో చేరారని రాపాక వరప్రసాద్ వెల్లడించారు. జనసేన తరపున గెలిచినా తన ప్రయాణం అంతా వైసీపీతోనే అని ఆయన అన్నారు. తాను వైసీపీకి చెందిన వ్యక్తిననంటూ బ‌హిరంగంగానే చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

అంతేకాదు, గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు యత్నించానని.. బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరానని రాపాక వివ‌రించారు. అలాగే జనసేన ఓ వర్గానికి పార్టీ అని.. భవిష్యత్తులో జనసేన పార్టీ ఉనికే ఉండదని స్పష్టంచేశారు. కాగా, జనసేన నుంచి గెలిచిన రాపాక గ‌త కొంతకాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో సీఎం జగన్‌పై బాహాటంగానే ప్రశంసలు కురిపిస్తూ వైసీపీకి ద‌గ్గ‌రువుతున్న సంగ‌తి తెలిసిందే.

నా ప్ర‌యాణం వైసీపీతోనే.. జనసేన ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts