మూడ్ ఆఫ్ నేషన్ సర్వే: నంబర్ 1 స్థానంలో ఆ హీరో, హీరోయిన్‌!!

August 8, 2020 at 2:56 pm

‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఓ టెలిఫోన్ సర్వే నిర్వహించింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే. ఈ స‌ర్వేలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన హీరో, హీరోయిన్ ఎవ‌రు అని ఆరా తీయ‌గా.. నంబ‌ర్ 1 స్థానంలో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌, దీపికా పదుకొనే నిలిచారు. ఎంతో మందికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్‌కు ఈ పోల్‌లో 24 శాతం ఓటింగ్ రాగా.. రెండ‌లో స్థానంలో అమితాబ్‌ బచ్చన్‌కు 23 శాతం ఓటింగ్ వ‌చ్చింది.

ఆ త‌ర్వాత షారుఖ్ ఖాన్‌కు 11 శాతం, సల్మాన్ ఖాన్‌కు 10 శాతం, ఆమిర్ ఖాన్‌కు 6 శాతం, అజయ్‌ దేవ్‌గణ్‌కు 4 శాతం, హృతిక్‌ రోషన్‌కు 4 శాతం, రణ్‌వీర్‌ సింగ్‌కు 4 శాతం మ‌రియు ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు 2 శాతం ఓటింది. ఇక ప్రియాంక, ఆలియా భట్, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ వంటి వారిని వెనక్కి నెట్టి దీపిక ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది.

ఈ సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు పడ్డాయి. ఇక, తర్వాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రాకు 14 శాతం, కత్రినా కైఫ్‌కు 13 శాతం, ఐశ్వర్యారాయ్‌కు 10 శాతం, అనుష్కా శర్మకు 9 శాతం ఓట్లు న‌మోదు అయ్యాయి. అలాగే బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగన, ఆలియా భట్ సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచినట్టు ఈ స‌ర్వేలో పేర్కింది ఇండియా టుడే.

మూడ్ ఆఫ్ నేషన్ సర్వే: నంబర్ 1 స్థానంలో ఆ హీరో, హీరోయిన్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts