దాని వ‌ల్లే క‌రోనా రోగులు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు: నాగ చైత‌న్య

August 1, 2020 at 3:32 pm

క‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారింది ఈ మ‌హ‌మ్మారి. ఎక్క‌డో చైనాలో పుట్టికొచ్చిన ఈ క‌రోనా మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారింది. ఈ వైర‌స్ ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లువురు సెల‌బ్రెటీలు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక తాజాగా అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య కూడా అదే చేశాడు. క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే భయపడిపోతుంటారని, దాంతో ఒత్తిడికి గురవ్వడం వల్లే అధికంగా సమస్యలొస్తాయని నాగచైతన్య అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కరోనా వైరస్‌ గురించి మాట్లాడాడు. భయంతోనే వైరస్‌ లక్షణాలున్నా చాలా మంది బయటకు చెప్పలేకపోతున్నారని, ఇలా చేయడంతో ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారని ఆయన అన్నాడు.

ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. అందరిదీ. దీన్ని అంతా ఎదుర్కొవాల్సిందే. వైరస్ ఉందని మీలోనే దాచుకుంటే అది మొదటి స్టేజి నుంచి చివరి స్టేజ్ కు వెళ్తుంది. కాబట్టి లక్షణాలు ఉన్నాయని అనిపించిన వెంటనే వైద్య సాయానికి వెళ్లాల‌ని చైతు సూచించారు. అలాగే క‌రోనా పై ప్రతి ఒక్కరూ భయాల్ని వీడాలని నాగచైతన్య పిలుపునిచ్చాడు. కరోనా సోకి కోలుకున్నాక అనుభవాల్ని అందరితో పంచుకోవాలని ఆయన చెప్పాడు. అలాగే, ప్లాస్మా దానం చేయాలని, అది చాలా మంది ప్రాణాల్ని నిలబెడుతుందని తెలిపాడు.

దాని వ‌ల్లే క‌రోనా రోగులు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు: నాగ చైత‌న్య
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts