వైసీపీలో కోటాలో నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ఖాయ‌మైందా…!

August 7, 2020 at 11:11 am

రాజ‌కీయాల్లో శ‌త్రువుకు శ‌త్రువే మిత్రుడు అంటారు. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇదే సూత్రం వ‌ర్తించ‌బోతోంది. ఏపీలో రెండు బ‌ల‌మైన రాజ‌కీయ ప‌క్షాలుగా ఉన్న అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీకి ఉమ్మ‌డి శ‌త్రువుగా జ‌న‌సేన ఉంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ +  బీజేపీ కూట‌మికి స‌పోర్ట్ చేసిన జ‌న‌సేన గతేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసింది. విచిత్రం ఏంటంటే 2014లో మిత్రులుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మూడు పార్టీలు గ‌త ఎన్నిక‌ల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ మూడు పార్టీలు వైసీపీ ప్ర‌భంజ‌నం మందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. చివ‌ర‌కు బీజేపీ అయితే నోటాతో పోటీ ప‌డి మ‌రీ ఓడిపోయింది. జ‌న‌సేన మాత్రం నోటాపై విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు జ‌న‌సేన, బీజేపీ దోస్త్‌లు అయ్యాయి. బీజేపీకి ఇప్పుడే కొత్త అధ్య‌క్షుడు వ‌చ్చాడు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా నిన్న‌టి వ‌ర‌కు ఉన్న క‌న్నా చంద్ర‌బాబుతో అంట‌కాగారు. ఇప్పుడు కొత్త అధ్య‌క్షుడిగా ఉన్న సోము వీర్రాజు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌వుతోన్న ప‌రిస్థితులే ఏపీలో క‌నిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సైతం భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్‌నే ఎక్కువుగా న‌మ్ముతోంది. బీజేపీకి అటు రాజ్య‌స‌భ‌లోనూ బ‌లం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అవ‌స‌రం బీజేపీకి ఎంతో ఉంది.

ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక సీటును బీజేపీ ద‌క్కించుకోవాల‌ని చూస్తోంద‌ట‌. వైసీపీ స‌పోర్ట్‌తో బీజేపీ ద‌క్కించుకున్న ఈ సీటును ఉమ్మ‌డి మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని.. అది కూడా మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు ఇస్తార‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నాగ‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు త‌మ్ముడిని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపించే ప్లాన్‌ను చిరు తీసుకున్నాడ‌ని… అందుకే ఇటీవ‌ల జ‌గ‌న్‌తో క్లోజ్‌గా మూవ్ అవ్వ‌డంతో పాటు అటు సోము వీర్రాజును క‌ల‌వ‌డం వెన‌క ఇదే ఉద్దేశం అని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నాగ‌బాబు జ‌గ‌న్‌ను పొగుడూతూ టీడీపీని టార్గెట్ చేశాడ‌ని.. టీడీపీ మీద సెటైర్ల‌తో పాటు బాల‌య్య మీద ఫైరింగ్ చేస్తున్నాడ‌ని.. ఇదంతా దాంట్లో భాగ‌మే అని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తాడా ? ఆ సీటు బీజేపీ తాను తీసుకోకుండా జ‌న‌సేన‌కు ఇస్తుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

వైసీపీలో కోటాలో నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ఖాయ‌మైందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts