మ‌హేష్ బ‌ర్త్‌డేకు నమ్రత ఎలా విష్ చేసిందో తెలుసా??

August 9, 2020 at 8:59 am

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు నేడు 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. స్టార్ హీరోల బర్త్ డేలు వస్తున్నాయంటే, సోషల్ మీడియాలో అభిమానుల హడావుడి ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటోస్ షేర్ చేస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు పేరిట బర్త్ డే ట్యాగ్, వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు, వరల్డ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డును పట్టుకొచ్చింది.

మ‌రోవైపు మ‌హేష్‌కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మహేష్ సతీమణి నమ్రత పెట్టిన పోస్ట్ సూపర్ స్టార్ అభిమానులను మరింత హుషారెత్తిస్తోంది. ఇంత‌కీ న‌మ్ర‌త మ‌హేష్ ఎలా విష్ చేసిందంటే.. సరిగ్గా నిన్న అర్థరాత్రి 12 గంటలు దాటగానే ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ టచింగ్ మెసేజ్ పెట్టింది.

`నీ నుంచి నిజమైన ప్రేమను పొందుతున్నా.. హ్యాపీ బర్త్ డే మహేష్.. ఇప్పుడైనా ఎప్పుడైనా నీకు చెప్పేది ఒక్కటే ఐ లవ్ యూ` అని పేర్కొంటూ తన నుదిటిపై ప్రేమగా మహేష్ ముద్దుపెడుతున్న ఫోటో షేర్ చేసింది నమ్రత. ఇక ఇది చూసిన మ‌హేష్ ఫ్యాన్స్ హుషారుగా.. స్వీట్ కంపుల్‌, సూపర్ జోడీ, సరిలేరు మీకెవ్వరు అంటూ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

మ‌హేష్ బ‌ర్త్‌డేకు నమ్రత ఎలా విష్ చేసిందో తెలుసా??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts