సైకో కిల్లర్ గా నాని.. అరాచ‌కం సృష్టించిన `వీ` టైల‌ర్‌!

August 26, 2020 at 1:07 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు క‌లిసి న‌టించిన చిత్రం `వీ`. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5వ తేదీన ‌విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయింది.

‘ఎలా ఫినిష్ చేద్దాం’ అంటూ ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగుని గుర్తు చేస్తూ నాని తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని విడుదల చేశాడు. ఇక హలో మైక్ టెస్టింగ్ 123, 123.. ఏం చేసినా ఎంటర్టైనింగ్‌గా చేయాలనేది నా పాలసీ అని నాని వాయిస్‌తో మొద‌లైన ఈ సినిమా అభిమానులను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సైకో కిల్లర్ గా నాని క‌నిపించ‌నుండ‌గా.. సుధీర్‌బాబు పోలీసుగా నటిస్తున్నాడు. 1.45 నిమిషాలు ఉన్న ఈ టైల‌ర్ అరాచ‌కం సృష్టించింది.

ట్రైలర్ ఆధ్యంతం సస్పెన్స్ సన్నివేశాలతో ఆకట్టుకోగా.. నాని, సుధీర్ బాబు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయ‌ని చెప్పాలి. ఇక ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు అనే డైలాగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేశారు. కాగా, వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

సైకో కిల్లర్ గా నాని.. అరాచ‌కం సృష్టించిన `వీ` టైల‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts