చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో షాక్ ఇచ్చిన మనవడు దేవాన్ష్.. వైర‌ల్ వీడియో!

August 15, 2020 at 8:34 am

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న మ‌న‌వుడు, నారా వారి మూడో తరం దేవాన్ష్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. తాజాగా చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న మ‌న‌వుడు దేవాన్ష్ సూప‌ర్ షాక్ ఇచ్చి.. అందిరితోనూ శ‌భాష్ అనిపించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చంద్రబాబు జూమ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో చంద్ర‌బాబు అమరావతి అంశంపై, రాష్ట్ర ప్రస్తుత పరిస్తితులపై మాట్లాడుతున్న‌ సమయంలో.. ఒక్క‌సారిగా సీన్‌లోకి మనవడు దేవాన్ష్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రెస్‌మీట్ జరుగుతున్న విష‌యం తెలుసుకోకుండా తాత చంద్రబాబు వెనుక ఉన్న పుస్తకాన్ని తీసుకునేందుకు వచ్చాడు. అయితే ఇంతలో లైవ్ జరుగుతోందని గమనించిన దేవాన్ష్‌.. కెమెరాకు చిక్క‌కుండా చాలా జాగ్రత్తగా తాత పక్కకు జరిగాడు.

అనంత‌రం తనకు కావాల్సిన అక్బర్ బీర్బల్ పుస్తకం తీసుకుని అక్కడి నుంచి మెల్ల‌గా పాకుకుంటూ వెళ్లిపోయాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఇక తాతయ్య వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని తెలిసి.. ఆ వీడియోలో కనపడి డిస్టర్భ్ చెయ్యకూడదని భావించిన దేవాన్ష్ క్రమశిక్షణ సూప‌రంటూ తెలుగు త‌మ్ముళ్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో షాక్ ఇచ్చిన మనవడు దేవాన్ష్.. వైర‌ల్ వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts