కీర్తి సురేష్‌కు త‌ల్లిగా న‌య‌న్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌?

August 6, 2020 at 1:51 pm

నయ‌న‌తార‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మ‌డు.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో చ‌ల‌రేగిపోతోంది. తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోలంద‌ని
స‌ర‌స‌న న‌టించిన న‌య‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.

అయితే న‌డ‌న్‌ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో చ‌ర్చ‌ నడుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న పిల్లల తల్లి పాత్రలో నటించిన నయన్.. ఈ సారి స్టార్‌ హీరోయిన్ తల్లిగా నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తివివ‌రాల్లోకి వెళ్తే.. సూప‌ర్ ర‌జ‌నీ కాంత్ హీరోగా ‘అన్నాత్తె ‘ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

అజిత్‌‌‌‌కి వరుస విజయాలు ఇచ్చిన శివ ఈ సినిమాకి దర్శకుడు. ఖుష్బూ, మీనాతో పాటు నయనతార, కీర్తి సురే ష్ కూడా ఈ చిత్రంలో నటిస్తు న్నారు. అయితే ఇందులో కీర్తి, రజనీ కుమార్తెగా కనిపించనుందట. ఇక ఆమె తల్లి పాత్రలో నయన్‌ కనిపించనున్నట్లు సమాచారం. తన పాత్ర బలంగా ఉండటంతో ఇందులో నటించేందుకు నయన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. ఇక న‌య‌న్ నిర్ణ‌యంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది మ‌రికొన్ని రోజుల్లో తెలియ‌నుంది.

కీర్తి సురేష్‌కు త‌ల్లిగా న‌య‌న్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts