
వరుస ప్లాపులతో ఉన్న నితిన్ కెరీర్‌కు భీష్మ సినిమా ఊపిరి లూదింది. భీష్మ హిట్, పెళ్లితో నితిన్ ఈ యేడాది వరుస విజయాలు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక కరోనా లేకపోయి ఉంటే నితిన్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్లో పెట్టి ఉండేవాడు. ఇక నితిన్ ప్రస్తుతం అంథాదూన్ సినిమా రీమేక్ హక్కులు కొని దగ్గర పెట్టుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం ఖరారైంది. సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు చేసిన పాత్రను ఇక్కడ ఎవరితో చేయిస్తారా ? అన్నది మాత్రం ఓ పట్టాన తేలడం లేదు.
ముందుగా సన్ననడుము సుందరి ఇలియానాను ఈ రోల్ చేయమని అడిగారట. ఆమె నో చెప్పడంతో పాటు తెలుగులో తాను మళ్లీ నటించాలంటే హీరోయిన్‌గానే తప్పా అలాంటి రోల్స్ చేయనని చెప్పేసిందట. దీంతో పలువురు హీరోయిన్లను ఈ పాత్ర చేయమని అడిగిన నితిన్ ఇప్పుడు చివరకు ముదురు ముద్దుగుమ్మ నయనతారను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్‌గా ఏ మంచి పాత్ర వచ్చినా చేసేందుకు నయన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అయితే ఆమెతో వచ్చిన సమస్య అల్లా భారీ రెమ్యునరేషన్.
ఆమె ఒక్కో సినిమాకు తమిళ్లో రు. 4 కోట్ల వరకు తీసుకుంటోంది. ఇప్పుడు నితిన్ అంత ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ప్రమోషన్లకు కూడా రాదు. ఇక ఇప్పుడు అంధాదూన్ రీమేక్ కు నయనతార కాస్త భారీగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. నయనతార ఉంటే సినిమాకు మంచి ఉంటుందనే నితిన్ ఆమెను అడిగితే ఆమె చెప్పిన రేటుతో నితిన్ షాక్‌లోకి వెళ్లాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెతో కాస్త తగ్గించుకోమని భేరసారాలు కూడా మొదలయ్యాయి అంటున్నారు.