ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్… స్టోరీ, బ‌డ్జెట్ లాక్‌…!

August 11, 2020 at 5:07 pm

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్ ప‌లుసార్లు వాయిదాలు ప‌డుతోంది. ఈ లెక్క‌న చూస్తే వ‌చ్చే యేడాది సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ మైత్రీ మేక‌ర్స్ నిర్మించే ప్రాజెక్టును లాక్ చేసిన‌ట్టు వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క‌థ‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పేశాడ‌ని.. రు. 200 కోట్ల‌తో పాన్ ఇండియా క‌థాంశంతో ఈ సినిమా రాబోతుంద‌ట‌.

ప్ర‌శాంత్ చెప్పిన మెయిన్ లైన్ ఎన్టీఆర్‌ను మెప్పించ‌డంతో ఓకే చేసేశాడ‌ట‌. ఇక కేజీఎఫ్ ఇప్ప‌టికే హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ ప‌నిలో బిజీగా ఉన్న నీల్‌… అది కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ ప్రాజెక్టుపై క‌స‌ర‌త్తులు చేస్తాడ‌ట‌. లాక్‌డౌన్ వ‌ల్ల ఐదారు నెలలు ఖాళీగా ఉన్న ప్ర‌శాంత్ ఎన్టీఆర్ సినిమా క‌థ‌పై భారీ క‌స‌ర‌త్తులు చేశాడ‌ట‌. ఈ సినిమా కథ కూడా లీక్ అయినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. సెకండాఫ్‌లో యాక్ష‌న్ పెద్ద విధ్వ‌సం రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. రు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు.

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్… స్టోరీ, బ‌డ్జెట్ లాక్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts