ఏపీలో కొనసాగుతున్న కరోనా పరంపర..!

August 13, 2020 at 6:23 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. ఇక ఈ బులెటిన్ ప్రకారం మొత్తం 55, 692 శాంపిల్స్ పరీక్షించగా అందులో 9996 మందికి covid 19 పాజిటివ్ గా తేలింది. దీంతో నేటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2, 64,142 కు చేరుకుంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 9499 మంది ప్రజలు కరోనా బారి నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఖ్యతో నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,70 ,924 కు చేరుకుంది.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90, 840 కరోనా కేసులు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27, 05, 459 శాంపిల్స్ ను పరీక్షించారు. అలాగే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా covid 19 బారినపడి 82 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలోని కారణం మృతుల సంఖ్య 2378 కు చేరింది. ఏది ఏమైనా ఓవైపు జగన్ సర్కార్ కరుణ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరుగుతూ ఉన్నాను తెచ్చుకొని అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా 265 మంది గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడి మృతి చెందారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 37,146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ఏపీలో కొనసాగుతున్న కరోనా పరంపర..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts