పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంట తీవ్ర విషాదం!!

August 7, 2020 at 8:54 am

ప్ర‌ముఖ న‌టుడు, రచయిత ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. పరుచూరి వెంకటేశ్వరరావు భార్య క‌న్నుమూశారు. వెంక‌టేశ్వ‌ర‌రావు భార్య‌ విజయలక్ష్మి (74) ఈరోజు తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయలక్ష్మి.

ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, న‌టులు ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నారు. కాగా, న‌టుడిగానే కాకుండా.. ర‌చ‌యితగా కూడా పేరు సంపాదించుకున్న పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు.. పరుచూరి గోపాలకృష్ణకు అన్న అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు చిరజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ఈ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రచయతలుగా పని చేశారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా గుర్తింపు పొందారు.

పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంట తీవ్ర విషాదం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts