వాటే షాకింగ్ న్యూస్‌: అంజ‌లి ల‌వ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… !

August 7, 2020 at 11:04 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాన నటిస్తోన్న సినిమా వ‌కీల్ సాబ్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే మూడొంతుల‌కు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ తెలుగు హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ట‌. ఆ తెలుగు హీరోయిన్ ఎవ‌రో కాదు మ‌న తెలుగు పాప అంజ‌లి.

ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన ఈ ముదురు ముద్దుగుమ్మ అంజ‌లి.. అంజ‌లి ఇప్ప‌టికే వెట‌ర్ హీరోలు వెంక‌టేష్‌, బాల‌య్య‌తో క‌లిసి న‌టించింది. ఇక వ‌కీల్‌సాబ్ ఇప్పటికే బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్‌గా వ‌కీల్ సాబ్ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అంజ‌లి ల‌వ్‌లో ప‌డే లాయ‌ర్‌గా ప‌వ‌న్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వీరిద్ద‌రు క‌లిసి వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టిస్తున్నారు.

వాస్త‌వంగా ఈ సినిమా ఒరిజిన‌ల్లో ల‌వ్ ట్రాక్ లేదు. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను సంతృప్తి ప‌రిచేందుకే ఈ ల‌వ్ ట్రాక్ రెడీ చేశార‌ట‌. ఇప్పుడు ప‌వ‌న్‌ను ల‌వ్‌లో ప‌డేసే ఆ ల‌క్కీ ఛాన్స్ అంజ‌లీకి ద‌క్కింద‌ట‌. మ‌రీ పీకే, అంజ‌లి ల‌వ్ ట్రాక్ ఎంత‌లా రంజింప చేస్తుందో ? చూడాలి. ఇప్ప‌టికే 35కు చేరువ‌లో ఉన్న అంజ‌లి ర‌వితేజ‌, వెంకీ, బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోల‌తో రొమాన్స్ చేసింది. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ ప‌క్క‌న జాక్‌పాట్ కొట్టేసింది. ఇక ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

వాటే షాకింగ్ న్యూస్‌: అంజ‌లి ల‌వ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts