మ‌ళ్లీ 29 ఏళ్ల త‌ర్వాత అయోధ్యకు చేరుకున్న‌ మోదీ.. భూమి పూజకు సర్వం సిద్ధం!!

August 5, 2020 at 12:01 pm

ఎన్నో కోట్ల మందికి పైగా హిందువులు ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. అయోధ్యలో అత్యంత వైభవంగా రామాలయం నిర్మాణానికి పూజలు సర్వం సిద్ధం అ‌య్యాయి. ఈ మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరుగన‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో పాల్గొనేందుకు మోదీ కొద్ది సేప‌టి క్రిత‌మే ఆయోధ్య‌కు చేరుకున్నారు. 29 ఏళ్ల త‌ర్వాత మోదీ.. అయోధ్య‌కు వ‌చ్చారు.

1991లో మోదీ చివ‌రిసారి అయోధ్య వెళ్లారు. ఆ రోజుల్లో బీజేపీ అధ్య‌క్షుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి.. తిరంగా యాత్ర చేప‌ట్టారు. ఆ యాత్ర స‌మ‌యంలో మోదీ అయోధ్య విజిట్ చేశారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఫైజాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నా ఆయ‌న అయోధ్య వెళ్ల‌లేదు. ఇక అయోధ్య‌లో ఉన్న రామ్‌ల‌ల్లాను ద‌ర్శించుకుంటున్న తొలి ప్ర‌ధాని కూడా మోదీ కావ‌డం విశేషం.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ… శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఉదయం 11.30కు అయోధ్య చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి మోదీ కిందకు దిగగానే… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. అధికారిక ప్రకటన ప్రకారం… అసలైన భూమిపూజ మధ్యాహ్నం 12.44కి మొదలై… 12.45లోపలే ముగుస్తుంది.

మ‌ళ్లీ 29 ఏళ్ల త‌ర్వాత అయోధ్యకు చేరుకున్న‌ మోదీ.. భూమి పూజకు సర్వం సిద్ధం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts