ప్ర‌భాస్ `రాధేశ్యామ్` విష‌యంలో ఎందుకంత గంద‌ర‌గోళం!!

August 12, 2020 at 10:09 am

బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటలీ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టైటిల్‌ని ఇటీవ‌లే చిత్ర బృందం రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది ఇంత వరకూ క్లారిటీ రాలేదు.ఇటీవ‌ల నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత ఏఆర్ రెహ్మాన్, ఎస్ ఎస్ తమన్ ఇలా అనేక పేర్లు వినిపించాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ ఫిక్స్ కాలేదు. ఇలాంటి త‌రుణంలో `సాహో`‌ లాగే ఈ సినిమాకు కూడా అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

వాస్త‌వానికి సాహో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శంకర్ ఎహషాన్ లాయ్ త్రయంతోపాటు, జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్నిచ్చారు. ఈ సినిమాకు ఇంకా చాలామంది సంగీతాన్నందించినట్టు కూడా పేర్లు వినిపిస్తాయి. అయితే ఎంత మంది సంగీతం అందించినా.. ఈ సినిమా మ్యూజిక‌ల్‌గా హిట్ అవ్వ‌లేక‌పోయింది. ఇప్పుడు రాధేశ్యామ్ విష‌యంలోనూ అదే గంద‌ర‌గోళం నెల‌కొంది. ఒక‌‌వేళ ఏరికోరి అందర్నీ తీసుకొచ్చి క‌ల‌గాపుల‌గం చేస్తే సాహో రిజల్ట్ లాగానే.. రాధేశ్యామ్ రిజ‌ల్ట్ ఉంటుంద‌ని అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భాస్ `రాధేశ్యామ్` విష‌యంలో ఎందుకంత గంద‌ర‌గోళం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts