ప్రశాంత్ నీల్ సినిమా ఎన్టీఆర్‌తోనా.. ప్ర‌భాస్‌తోనా?

August 13, 2020 at 11:49 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రశాంత్ నీల్‌ కెజియఫ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో ఈ దర్శకుడు ఒక్కసారిగా అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. దాంతో ప్రశాంత్ కు ఆఫర్ల వెల్లువ వచ్చింది.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సీన్‌లోకి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చాడు. వాస్త‌వానికి `కేజీఎఫ్` నిర్మాతలకు ప్రశాంత్ మరో సినిమా చేయాల్సి ఉందట. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడట.

ప్రశాంత్‌కు, ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే ప్రభాస్ కోసం ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ కథను ప్రశాంత్ సిద్ధం చేస్తున్నాడట. ఈ విషయంపైనే ఇటీవల ప్రభాస్ తో ఈ దర్శకుడు మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. అయితే ప్రశాంత్ నీల్ సినిమా ముందు ఎన్టీఆర్‌తోనా.. ప్ర‌భాస్‌తోనా అనే విషయంలో క్లారిటీ లేదు.

ప్రశాంత్ నీల్ సినిమా ఎన్టీఆర్‌తోనా.. ప్ర‌భాస్‌తోనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts