రేష‌న్ కార్డు ఉన్న‌వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌!

August 19, 2020 at 10:34 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా.. క్ర‌మంగా ప్ర‌పంచ‌దేశాలు పాకేసింది. ఇక కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనా ధాటికి ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు.

తాజాగా రేష‌న్ కార్డు ఉన్న‌వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌. ఏపీలోని అన్ని జిల్లాలో ఇవాళ్టి నుంచి పదో విడత నిత్యావసర సరుకుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత, కొత్త రేషన్‌ కార్డులకు బుధవారం నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేయనున్నారు. రేషన్‌ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు ఫ్రీగా రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు.

పీఎం గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా రేషన్‌ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక ఒక్కో సభ్యునికి 5 కేజీల బియ్యం, కార్డుకు కేజీ శనగలు ఉచితంగా అందజేయనున్నారు. పంచదార మాత్రం రూ.17కు ఇవ్వనున్న‌ట్టు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు వెల్ల‌డించారు.

రేష‌న్ కార్డు ఉన్న‌వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts