గుడ్‌న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం‌.. విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు!!

August 11, 2020 at 10:36 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడుపోసుకున్న క‌రోనా వైర‌స్‌.. అంత‌కంత‌కూ విజృంభించి ప్ర‌పంచ‌దేశాలు పాకేసింది. ఈ మ‌హ‌మ్మారి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని అదుపు చేయ‌డం సాధ్యం కావ‌డంతో. దీంతో క‌రోనా నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్ధులందరూ ఆన్‌లైన్‌ ద్వారానే విద్యనభ్యసిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే విద్యార్థులందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకపోవడం ఆన్‌లైన్ క్లాసులకు సమస్యగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలోనే విద్యార్థులంద‌రికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 12వతేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా రావడంతో తొలి విడతగా పంజాబ్ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో ప్రారంభించబోతున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గుడ్‌న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం‌.. విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts