రాజుగారి కొత్త స్కెచ్…వర్కౌట్ అవుతుందా?

August 12, 2020 at 11:41 am

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వపక్షంలో విపక్ష నేతగా మాదిరిగా తయారైన విషయం తెలిసిందే. వైసీపీ, బీజేపీ, టీడీపీ ఇలా పార్టీలని మారుస్తూ వచ్చిన రాజుగారు..2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి, వైసీపేలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేసి దాదాపు 34 వేల ఓట్ల తేడాతో గెలిచారు. అయితే గెలిచాక కొన్ని నెలలు బాగానే ఉన్న రాజుగారు…సడన్‌గా సొంత ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై రివర్స్ అవ్వడం మొదలుపెట్టారు. సొంత నేతలే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు.

ఈ విమర్శల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రాజుగారి మీద అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక అక్కడ నుంచి ఎంపీ మరింత రివర్స్ అయ్యారు. ప్రతిరోజూ ప్రతిపక్ష టీడీపీ, జనసేనల కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డైలీ మీడియా సమావేశం పెట్టడం ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. ఇక ఈయన విమర్శలు మరింత ఎక్కువైపోవడంతో, ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని వైసీపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న రాజుగారిపై అనర్హత వేటు పడటం చాలా కష్టం. ఒకవేళ వేటు పడినా కూడా దానికి ఒక స్కెచ్ రెడీ చేసుకుంటున్నారట రాజుగారు. అన్నీ ప్రతిపక్షాల మద్ధతుతో వైసీపీకి ప్రత్యర్ధిగా రాజుగారు బరిలో దిగాలని చూస్తున్నారట. ఎలాగో బీజేపీ-జనసేనలు పొత్తులో ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఎంపీకి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. అలా అని ఆ రెండు పార్టీల మీద ఆధారపడి పోటీ చేస్తే రఘు గెలవడం కష్టం. దీంతో రాజుగారు టీడీపీ మద్ధతుగా కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నరసాపురంలో టీడీపీకి ఎలాగో బలమైన కేడర్ ఉంది. మొన్న ఎన్నికల్లోనే 34 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేనల సపోర్ట్ తీసుకుంటే తన గెలుపుకు తిరుగులేదని రాజుగారు భావిస్తున్నారట.

రాజుగారి కొత్త స్కెచ్…వర్కౌట్ అవుతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts