రైల్వే కొత్త రికార్డ్.. కలెక్షన్ లు మించి రిఫండ్

August 12, 2020 at 8:01 pm

167 ఏళ్ల రైల్వే శాఖ చరిత్రలో బుకింగ్​ ద్వారా వచ్చిన ఆదాయం కంటే అధిక మొత్తంలో వినియోగదారులకు తిరిగి చెల్లించింది రైల్వేశాఖ.​ కరోనా సంక్షోభంలో రూ. 1,066 కోట్ల నెగిటివ్ ప్యాసింజర్ సెగ్మెంట్ ఆదాయంగా గుర్తించింది. మధ్యప్రదేశ్​కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్​ ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది రైల్వేశాఖ. అదే సమయంలో సరకు రవాణా ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు మొదటి మూడు నెలల పాటు అన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. దీంతో టికెట్లు బుక్​ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి చెల్లించింది. బుక్​ చేయటం ద్వారా వచ్చిన నగదు కంటే వారికి తిరిగి చెల్లించిన మొత్తం అధికంగా ఉంది అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరేన్​ తెలిపారు.ఈ సమయంలో సరకు రవాణా కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో ఏప్రిల్​లో రూ. 531.21 కోట్లు, మేలో రూ. 145.24 కోట్లు, జూన్​లో 390.6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.గత ఏడాది ఏప్రిల్​ నెలలో రూ. 4,345 కోట్లు, మేలో రూ.4,463 కోట్లు, జూన్​లో 4,589 కోట్లు సంపాదించినట్లు తెలిపింది రైల్వేశాఖ. ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా మొత్తం రూ.40 వేల కోట్లు నష్టం జరిగినట్లు వెల్లడించింది.

రైల్వే కొత్త రికార్డ్.. కలెక్షన్ లు మించి రిఫండ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts