కరోనాను గెలిచిన రాజమౌళి… ప్లాస్మా దానానికి సిద్ధం..!

August 12, 2020 at 8:04 pm

దర్శకధీరుడు రాజమౌళి సహా ఆయన కుటుంబం కరోనాను జయించారు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్​లో ఉన్న వారికి.. తాజాగా వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు జక్కన్న. దీంతో పాటు వారు ప్లాస్మా దానం చేయడానికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు.

తద్వారా శరీరంలో యాంటీబాడీస్​ మరింత ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు.ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్​చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

కరోనాను గెలిచిన రాజమౌళి… ప్లాస్మా దానానికి సిద్ధం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts