టీఆర్ఎస్ పార్టీలో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!

August 3, 2020 at 3:29 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది క‌రోనా. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌ను క‌మ్మేసి.. ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోవ‌ది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

Ramagundam MLA Korukanti Chander - Telangana data

ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. జాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా సోకింది. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్‌కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఎమ్మెల్యే చందర్ కరోనా పరీక్షలు చేయించుకోగా… ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రామగుండం మేయర్ గతవారం రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కాగా, తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,660కి చేరగా.. ప్రస్తుతం 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మ‌ర‌ణాల సంఖ్య ‌551కి చేరింది.

టీఆర్ఎస్ పార్టీలో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts