ప్రభాస్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన రానా

August 20, 2020 at 11:23 am

టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ దిగ్విజయంగా నడుస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు పలు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇందులో భాగంగా సినీ నటులు వరుస పెట్టి మొక్కలు నాటుతూ..మరికొందరికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని విసురుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు సైతం మొక్కలు నాటి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్, విజయ్, శృతిహాసన్‌లని కోరారు.

ఈ క్రమంలోనే శృతిహాసన్, మహేష్ ఛాలెంజ్ స్వీకరించి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, రానా, తమన్నాలని నామినేట్ చేసింది. అలాగే అంతకముందు ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని…రానా, రామ్ చరణ్, శ్రద్ధకపూర్‌లని నామినేట్ చేశారు. దీంతో తాజాగా శృతి, ప్రభాస్‌లు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రానా పూర్తి చేశాడు. ఇప్పటికే కొంత ఆలస్యమైందని చెప్పి, ప్రభాస్ తరుపున ఒక మొక్క, శృతి తరుపున ఒక మొక్క నాటి, తనని అనుసరించే వాళ్ళు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సూచించాడు.

ప్రభాస్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన రానా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts