ప్రారంభమైన రానా, మిహీకాల పెళ్లి సందడి.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు!!

August 6, 2020 at 4:02 pm

టాలీవుడ్ హ్యాండ్స్ మ్ హీరో రానా దగ్గుబాటి.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన మిహీకా బజాజ్‌ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసిని అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు. అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అందులో భాగంగా ఇటీవల ఇటీవల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను కూడా నిర్వహించుకున్నారు.

ఇక రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్‌ల వివాహాం ఫిక్స్ చేశారు. మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. హిందూ సంప్రదాయబద్ధంగా జరిగే వీరి వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఇక ఇరు కుటుంబాల ఇంటా పెళ్లి సందడి షురూ అయింది. వివాహానికి ముందు జరిగే హల్దీ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకలో మిహీకా పసుపు, ఆకుపచ్చ లెహంగాలో మెరిసిపోయింది. ఈ సందర్భంగా సీషెల్స్ డిజైనర్ ఆభరణాలను ఆమె ధరించారు. కుటుంబ సభ్యులు, మిహీకా క్లోజ్‌ ఫ్రెండ్స్ మధ్య ఈ వేడుక వైభవంగా జరగనుంది. మరోవైపు రానా ఇంట అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించనున్నారు. రానాను పెళ్లికొడుకుని చేసే కార్యక్రమం దగ్గుబాటి వారి ఇంట వేడుకగా జరగనుంది. కాగా, హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నారు.

రానా, మిహికాల పెళ్లి సందడి ప్రారంభం ...

ప్రారంభమైన రానా, మిహీకాల పెళ్లి సందడి.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts