
మెథడ్స్ అండ్ మోటివ్స్
…………………………………………1
విత్ యాన్ ఇన్స్ప్రేషన్
నీడ్ ఎ కన్విక్షన్
అండ్ ద ఒన్ మోర్ థాట్
డోంట్ బిలీవ్ ఎనీ పారామీటర్
ఇంట్రప్ట్ యువర్ సెల్ఫ్
దెన్ యూ నీడ్ ఎ ఛాయిస్
అండ్ దెన్ యూ గెయిన్ ఎ ఆప్షన్
2…………………………………………
వాట్ నాట్ అండ్ వాట్ ఎల్స్
అండ్ ద సెంటెన్స్ ఈజ్…
నెవర్ బ్లేమ్ ఎనీ ఒన్ ఎల్స్
ఇప్పుడు దారి ఎలా ఉంది అన్న ప్రశ్న
ఆ దారి నుంచి గమ్యం ఎలా చేరుకోవాలన్న ఆరాటం
వీటితో సహా ఇంకొన్ని..
…………………………………………3
ఫస్ట్ కాజ్ : నాన్న క్రమశిక్షణ నేర్పారు..
నాన్నంతటి నాన్న జీవితాన్ని మార్చారు..
ఇప్పుడు డైలాగ్ ఇలా ఉంది
గెలిచిన చోటు అంతిమం అనుకున్నవి
తోడుంటాయి..గెలవాల్సిన రోజు అంతిమం
అనుకున్నవి ఏమయినా ఉంటే అవి ప్రశ్నిస్తాయి
గెలుపు ఈ చదరంగాన కీలకం..
నిన్నటి ఓటమి నిరాశ అన్నీ అన్నీ నీటి రాతలే..
4…………………………………………
కసిరే వెలుగులున్నా..
ముసిరే చీకట్లున్నా..
చిన్నాన్న(అచ్చెన్న) కోసం తాపత్రయపడుతున్న సందర్భం. నాన్నను స్మరిస్తూ..నాన్నను ప్రార్థిస్తూ..ఏమయినా చేయాలన్న సంకల్పం ఇవన్నీ మదిలో మెదలాడుతూ..కదలాడుతూ ఉన్న సమయం..ఆ ఇంట..మరో భరోసా కావాలి. ఆ ఇంట..మరో నమ్మ కం కుదరాలి. ఈ సారి చిన్నాన్న అనారోగ్యంతో ఉన్నారు. ఈ సారి చిన్నాన్న గాయాలతో ఉన్నారు. అక్కడి నుంచి కోలుకుని బె యిల్ పొంది ఇటుగా త్వరలో శ్రీకాకుళానికి రానున్నారు.
…………………………………………5
రెండో సారి..
నమ్మకానికి ప్రతిరూపం
విశ్వసనీయతకు సంకేతిక
ఉదయం నుంచి ఫోన్లు మోగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆనందోత్సాహాలే మిన్నుముట్టుతున్నాయి. బా బాయ్ కూ, అబ్బాయ్ కూ ఒకేసారి సక్సెస్..ఇంతటి ప్రభంజనంలో ఒకేసారి సక్సెస్.. అక్కకూ సక్సెస్.. జనం నమ్మారు, నాయుడి గారి కుటుంబానికి మళ్లీ మళ్లీ ఓ గౌరవం దక్కించారు. అలా మొన్నటి ఎన్నిక ఆయనకు లాంఛన ప్రాయం..మొన్నటి విజయం ఇంకొంత నమ్మకానికి రెట్టింపు కారకం.
6…………………………………………
ఆనందించేను నేను..
ఆనందించాలి మీరు..
రామూ సర్ .. ఈసారి ఏమయినా చేయాలన్న బలమయిన నమ్మకంతో ఉన్నారు. ప్రబల చిత్తంతో ఉన్నారు.. నాతో మాట్లాడుతూ ఉన్నారు.. ఒక చిన్నారి మీరు కేవీలో సీటు ఇప్పించండి.. ఆ పేద కుటుంబానికి అండగా ఉండండి..అలానే రత్నా..రామూ సర్ ఇంకా ఆలోచిస్తున్నారు.. అంతకుమునుపు ఓ సంభాషణలో ఒక్కటే చెప్పారు.. లావేటి ఉమామహేశ్వరరావు అనే అమరుడి కు టుంబానికి అండగా ఉంటానని..మాట ఇచ్చారు.. నిలబెట్టుకుని ఆ కుటుంబానికి 50వేల రూపాయలు అందించారు.. రామూ సర్ కు ఒక్కటే చెప్పాను. అదే కుటుంబానికి మేమూ మా వంతు చేస్తాం అని! అలానే మా తరఫున తక్షణ సాయం అందించాక ఒక్క టే అన్నారు ఇటువంటి మంచి పరిణామాలు మరికొన్ని జరిగితే మేలు అండి అని! ఆనందించేను నేను..ఆనందించాలి మీరు..
…………………………………………7
వదంతులు వద్దు
వాస్తవాలు నమ్మండి
ఊరూ పేరూ లేని రాతలు చూసి నవ్వుకుంటాను నేను..కొన్ని సైట్లు అవే పనిగా చేస్తుంటే ఇంకా నవ్వుకుంటాను.. పార్టీ మారుతా రా అన్న ప్రశ్నకు కొన్ని వందల సార్లు ఆయన క్లారిఫికేషన్ ఇచ్చినా ఏవో వండి వార్చే వెబ్ మీడియాలు చూసి తప్పక నవ్వుకుం టాను. నిరాధార కథనాలే కాదు ఆ ఇంట లేనివేవో రాస్తారు.. ఆ ఇంట లేనివేవో తామేదో ప్రత్యక్షంగా చూసిన విధంగా రాసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అమ్మలాంటి పార్టీ వీడను అని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ మళ్లీ వివరణ ఇస్తారు..ఆయన..అంతేనా! ఇంకా పార్టీ కోసం ఏమయినా చేసేందుకు సిద్ధం అని తరుచూ చెబుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారు..
8…………………………………………
ఒక ప్రశ్న..
అవాస్తవాలు వీడండి
అపోహలు వద్దు..
…………………………………………9
పార్టీ మార్పునకు సంబంధించి అసత్య కథనాలపై..ఓ సందర్భంలో ఇలా స్పందించారు..ఆ మాటలు యథాతథంగా..రాజకీయంగా ఎన్ని సమస్యలు వచ్చినా కింజరాపు కుటుంబం ఎదుర్కొనేందుకు సిద్ధం. ఆ రోజు నాన్న ఎర్రన్న..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖ ర్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై పోరాడారు. ఇప్పుడు నా వంతు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు, కక్ష్యపూ రిత ధోరణిలో వై ఎస్సార్సీపీ సర్కార్ పనిచేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదెంత మాత్రం తగదు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో నాన్న స్ఫూర్తితో మరింత పట్టుదలతో పనిచేసి, కార్యకర్తల, జిల్లా ప్రజల మన్ననలు అందుకోవడమే ముందున్న లక్ష్యం. పార్టీ బ లోపేతానికి అధినే త ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేసేందుకు ఎన్నడూ సిద్ధమే. కింజరాపు కుటుంబం అంతా ఇవాళ ఏకతాటిపై ఉంది. మరింత సంకల్పంతో రానున్న కాలంలో పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చే స్తాం. ఓ వెబ్సైట్ కథనంలో పేర్కొన్న విధంగా బాబాయికి బెయిల్ మంజూరయ్యే క్రమంలో అధినేత చంద్రబాబు లాబీయింగ్ పని చేయలేదని చె ప్పడం తగదు. యావత్ పార్టీ అధినాయకత్వం ఈ విషయమై దృష్టి సారించి ఎప్పటికిప్పుడు సంబంధిత న్యాయ ని పుణులతో చ ర్చిస్తున్నారు. సంబంధిత వివరాలు వెల్లడించనంత మాత్రాన పార్టీ అధినాయకత్వం అలసత్వంతో ఉందని ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించారాయన.
10……………………………………….
నో వే : పార్టీ మారే విషయమై..
నేనేమయినా ఏనాడయినా చెప్పానా..అసలు పార్టీ మారేందుకు సన్నద్ధం అవుతున్నానని ఎలా రాస్తారు..వీటికి ఎన్ని సార్లు వివ రణ ఇచ్చినా సంబంధిత వర్గాల్లో మార్పు రాకపోవడం శోచనీయం. తల్లిలాంటి పార్టీ జీవితాన్ని ఇచ్చింది. తల్లీ,తండ్రీ అన్నీ తానై న న్నూ..నా కుటుంబాన్నీ నడిపించింది.ఇక అక్క ఆదిరెడ్డి భవానీ (రాజమహేంద్రి నగరి ఎమ్మెల్యే) విషయమై కూడా ఓ విషయం స్పష్టం చేస్తున్నా. బాబాయ్ కుటుంబానికి ఎల్లవేళలా అక్కా, నేనూ అండగానే ఉంటాం. తను కానీ, నేను కానీ పార్టీ మారేందుకు ఎ న్నడూ ఆలోచన కూడా చేయలేదు. అక్కా, నేనూ ఆ వేళ నుంచి ఈ వేళ వరకూ..బాబాయ్,పిన్నీ ఇంకా ఇతర కుటుంబ స భ్యుల మద్దతు, అమ్మా,నాన్నల దీవెనలు ఫలితంగానే ఇంతగా రాణించగలుగుతున్నాం. మాలో లేనివి,మా స్పర్థలకు కారణం కా నివి ఏ వేవో వెతికి, ఆపాదించి వార్తలు రాయడం తగదు అని మరీ!మరీ! విన్నవిస్తున్నా..అని చెప్పారాయన.
…………………………………………11
ఫోకల్ పాయింట్
నాన్న కల.. తనొక కొనసాగింపు
ఇవాళ కింజరాపు కుటుంబం ఆనందంలో ఉంది. త్వరలో బాబాయ్ నిర్దోషిత్వం నిరూపణకు నో చుకుంటుందన్న విశ్వాసం ఆ అ బ్బాయ్ లో ఉంది. ప్రజలు స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తే సంతోషిస్తాను అంటారు..అవినీతికి తావులేని రాజకీ యాలకు తానెప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని పదే పదే చెబుతారు..వీలున్నంత మేర వీలున్నంత సమయం సమస్యల పరిష్కారా నికే కేటాయిస్తూ ప్రజాసదనం కేంద్రంగా పనిచేస్తున్నారు. అది నాన్న కల.. తనొక కొనసాగింపు. శ్రీకాకుళం నగరం, ఎనభై అడుగు ల రహదారిలో ప్రజాసదన్ కొత్త కార్యాలయం ఏర్పాటయి నిన్నటితో రెండేళ్లు. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమా లకు అది కేంద్ర స్థానం కానుంది. ఒక ఖాకీ చొక్కా ఒక సైకిల్ యాత్ర జీవితాన్ని మార్చేయి..ఇప్పుడు కూడా మళ్లీ పోరాటం త ప్ప దు. అందుకు ఎన్నడూ సిద్ధమేనంటూ ఈ యువ ఎంపీ చెప్పే మాట కార్యకర్తలకో ఉత్సాహం..ప్రేరణ గుణకం కూడా..
– రత్నకిశోర్ శంభుమహంతి
పోస్టర్ ఫ్రేమ్ : ప్రభాకర్ అనుపోజు, హైద్రాబాద్ నగరి