రిలయన్స్ చెంత‌కు `టిక్‌టాక్`.. ముకేశ్ అంబానీ ప్లాన్ అదేనా?

August 13, 2020 at 12:30 pm

`టిక్ టాక్‌` చైనాకు చెందిన ఈ సోష‌ల్ మీడియా యాప్ అన‌తి కాలంలోనే భారీ క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది. వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్ ఇవ్వ‌డం‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ చేయడం వంటివి ఈ యాప్ ద్వారా క్రియేట్ చేస్తూ.. ఎంద‌రో సామాన్యులు స్టార్స్‌గా మారారు. కొంద‌రు అయితే సినిమాల్లో అవ‌కాశాలు కూడా అందుకున్నారు. ముఖ్యంగా భార‌త్‌లో సూప‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఈ యాప్‌ను‌.. బైటీ డ్యాన్స్ రూపొందించింది.

అయితే ప్ర‌స్తుతం భారత్ లో టిక్ టాక్ జర్నీ ముగిసింది. భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌ర్వాత.. భార‌త్ కేంద్ర ప్ర‌భుత్రం టిక్‌టాక్‌తో స‌హా 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో టిక్ టాక్‌ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ టిక్ టాక్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే బైట్ డ్యాన్స్ తో ప్రాధమిక చర్చలు సైతం పూర్తయ్యాయని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక దాదాపు నెల రోజుల క్రితమే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ‘టెక్ క్రంచ్’ తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొంది. మ‌రోవైపు టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై అధికారికంగా స్పందించేందుకు రిలయన్స్ నిరాకరించింది. అయితే ముకేశ్ అంబానీ ప్లాన్ వేరేలా ఉంద‌ని తెలుస్తోది. ప్ర‌స్తుతం టిక్‌టాక్ విలువ రెండు నుంచి ఐదు బిలియ‌న్ల వ‌ర‌కు ఉంటుంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌రికొద్ది రోజులు ఆగితే ఆ విలువ ఇంకా ప‌డిపోతే అప్పుడు టిక్‌టాక్‌ను కొనుగోలు చేద్దామ‌ని ముకేశ్ అంబానీ భావిస్తున‌ట్టు తెలుస్తోంది.

రిలయన్స్ చెంత‌కు `టిక్‌టాక్`.. ముకేశ్ అంబానీ ప్లాన్ అదేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts