సడక్ 2′ ట్రైలర్ చెత్త రికార్డు నమోదు

August 19, 2020 at 3:18 pm

ఇటీవలే వచ్చిన ‘సడక్ 2′ ట్రైలర్ చెత్త రికార్డు నమోదు చేసింది. యూట్యూబ్​లో ప్రపంచంలోనే అత్యధికులు డిస్​లైక్స్ కొట్టిన రెండో వీడియోగా నిలిచింది. భారత్​లో తొలిస్థానం సంపాదించింది.సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహేశ్ భట్ (దర్శకుడు), ఆలియా భట్(హీరోయిన్​)​.. ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.సడక్ 2’ ట్రైలర్ కు 11.65 మిలియన్లు డిస్​లైక్స్ వచ్చాయి…దీని కన్న ఎక్కువ డిస్​లైక్స్ వచ్చిన వీడియో కూడా ఉంది అది యూట్యూబ్​ రివైండ్ 2018-18.2 మిలియన్లు డిస్​లైక్స్ వచ్చాయి.

1991లో వచ్చిన ‘సడక్’కు సీక్వెల్ ఈ సినిమా. ఇందులో సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. దొంగబాబాల నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. మహేశ్ భట్ దర్శకత్వం వహించగా, ముకేశ్ భట్ నిర్మించారు. త్వరలో ఓటీటీ వేదికగా చిత్రం విడుదల కానుంది. తండ్రి మహేశ్​భట్ దర్శకత్వంలో ఆలియా నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

సడక్ 2′ ట్రైలర్ చెత్త రికార్డు నమోదు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts