మ‌హేష్ బ‌ర్త్‌డే కానుక అదిరింది..`సర్కారు వారి పాట` మోషన్ పోస్టర్ విడుద‌ల‌!

August 9, 2020 at 10:17 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నేడు 45వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా `సర్కారు వారి పాట` చిత్ర‌యూనిట్ మ‌హేష్ బాబు అభిమానుల‌కు అదిరిపోయే కానుక అందించారు. ప్ర‌స్తుతం మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా.

అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే కానుక‌గా.. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో రూపాయి నాణాన్ని చూపిస్తూ, దాన్ని మహేశ్ బాబు గాల్లోకి ఎగరవేస్తూ కనిపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ‘సర్కారు వారి పాట’ హుక్ లైన్ చిన్న బీట్ గా వినిపిస్తుంది.

ఈ మోష‌న్ పోస్ట‌ర్‌తో నిర్మాణ సంస్థలు మ‌హేష్‌‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అందిస్తూ అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే ప్రీ లుక్ పోస్టర్‌లోనూ, మోషన్ పోస్టర్ లోనూ మహేష్ ఫుల్ లుక్ మాత్రం చూపించకపోవడం ఫ్యాన్స్ ను ఒకింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి.

మ‌హేష్ బ‌ర్త్‌డే కానుక అదిరింది..`సర్కారు వారి పాట` మోషన్ పోస్టర్ విడుద‌ల‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts