రాహుల్ పదవి పై శివసేన సీత కన్ను..!

August 30, 2020 at 5:46 pm

కాంగ్రెస్​లో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తనను తానే బలహీనపరచుకుంటున్న తీరు ప్రతిపక్ష రాజకీయాల్లో శూన్యాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికల తరవాత పార్టీలో మొదలైన నాయకత్వ సంక్షోభాన్ని ఇప్పటికీ పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో అది కూరుకుపోయింది.

ఇటీవల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి 23 మంది సీనియర్లు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లోని తన కాలమ్‌లో తన అభిప్రాయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెప్పుకొచ్చారు.పార్టీ నడిపేందుకు పూర్తి స్థాయి, క్రియాశీల నాయకుడు కావాలంటూ సీనియర్లు లేఖ రాయడాన్ని రౌత్‌ తప్పుబట్టారు. రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టకండా ఆపితే అది వారి అవివేకమన్నారు.క్రియాశీలం పేరుతో రాహుల్‌ను అడ్డుకోవడమంటే పార్టీని నాశనం చేయడమేనని, వినాశనాన్ని కొనితెచ్చుకోవడమేనని రౌత్‌ పేర్కొన్నారు.వాట్సాప్​పై బిజేపికు పూర్తి పట్టు ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వాట్సాప్​కు భారత్​లో పేమెంట్ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవసరమని వ్యాఖ్యానించారు.

రాహుల్ పదవి పై శివసేన సీత కన్ను..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts